898 898 8787

ఛాతి ఎక్స్-రే(X-Ray) లో కనబడే ప్రధానమైన  శ్వాసనాడి సంబంధిత(Bronchovascular) గుర్తులు - MyHealth

Telugu

ఛాతి ఎక్స్-రే(X-Ray) లో కనబడే ప్రధానమైన  శ్వాసనాడి సంబంధిత(Bronchovascular) గుర్తులు

author

Medically Reviewed By
Dr Divya Rohra

Written By Srujana Mohanty
on Oct 18, 2022

Last Edit Made By Srujana Mohanty
on Mar 18, 2024

share
Prominent-Bronchovascular-Markings-in-Chest-X-Ray-Report
share

 ఛాతి ఎక్స్-రే కిరణాలు అనేవి రేడియాలజీకి సంబందించిన బహు సాధారమైన ప్రక్రియ. వీటి ద్వారా గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు , వెన్ను ,ఛాతి ఎముకలు, శ్వాస నాళికలు(Bronchioles) వంటి ఛాతికి సంబంధించిన అవయవాలు యొక్క స్థితిగతులను నిర్ధారించవచ్చు.

ఛాతి ఎక్స్-రే లో కనబడే శ్వాససంబంధిత గుర్తులు బట్టి ఊపిరితిత్తులు లో ఉండే రక్తనాళాలు యొక్క స్దితిని గమనించవచ్చు . ఎప్పుడైతే ఊపిరితిత్తులులో నీరు పట్టడం, కఫము చేరడం వంటివి జరుగుతాయో , దానిని బట్టి ఏర్పడిన ప్రధానమైన శ్వాసనాడి సంబంధిత(Bronchovascular) గుర్తులు ఛాతి ఎక్స్-రే ద్వారా వెల్లడపరచబడతాయి.

శ్వాస సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించడం వలన చికిత్స పొందడం మరియు త్వరగా కోలుకోవడం వంటి వాటికి ఆస్కారం కలదు. ఒకవేళ మీకు శ్వాస అందలేకపోవడం , దగ్గు,తీవ్ర గుండె నొప్పి వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటే వీటిని పెర్ఫ్యూషన్ కాంప్లికేషన్స్ (Perfusion Complications) అని అంటారు .ఇటువంటి లక్షణాలను అశ్రద్ధ చేయకుండా మీ యొక్క వైద్యుని సలహా మేరకు సమగ్ర పరీక్ష చేయించుకోవడము మంచిది.


ఈ క్రింద వ్రాయబడిన భాగములో కొన్ని ఛాతి ఎక్స్-రే నివేదికల ద్వారా బయలుపడిన ప్రధానమైన శ్వాస సంబంధిత (Bronchovascular) గుర్తులు గురించి ,వాటి యొక్క అర్ధము ఏమిటి అనే విషయాల గురించి స్పష్టముగా వివరించబడింది.

ఇందులో 

1.ప్రధానమైన శ్వాసనాడి సంబంధిత (Bronchovascular) గుర్తులు అంటే ఏమిటి ? 

 2.ప్రధానమైన శ్వాసనాడి సంబంధిత (Bronchovascular)  గుర్తులు వేటిని సూచిస్తాయి?

 3.పర్యవసానం (ముగింపు)

ఊపిరితిత్తులు మన శరీరములో ఊపిరి పీల్చుట విషయములో అతి ముఖ్యమైన అవయవం. ఛాతి యొక్క వాయుమార్గాల్లో ఏమైనా అడ్డుపడటం లేదా కఫము పట్టిన యెడల ఛాతి ఎక్స్-రే ద్వారా అటువంటి పరిస్థితులను క్షుణ్ణముగా పరిశీలించవచ్చు .

ఛాతి ఎక్స్-రే పరీక్ష చేత శ్వాసనాడి (bronchovascular ) గుర్తులను పరిశీలించవచ్చు . ఈ గుర్తులు బట్టి గాలి చేత నింపబడిన ఊపిరితిత్తుల నాళాలను మరియు నీరు పట్టిన ఊపిరితిత్తుల నాళాల మధ్య భేదాలను గమనించవచ్చు . నీరు వంటి వాటి చేత నింపబడిన ఊపిరితిత్తుల నాళాలు ప్రాముఖ్యముగా కనబడతాయి గాని గాలి చేత నింపబడిన ఊపిరితిత్తుల నాళాలు సరిగ్గా కనిపించవు .ప్రాముఖ్యముగా ఊపిరి పీల్చే సమయము నందు ప్రధానమైన శ్వాసనాడి సంబంధిత (Bronchovascular) గుర్తులు కనబడతాయి . రక్తనాళాలు ఊపిరి పీల్చే సమయములో కొంచెం పెద్దవిగా అవ్వడం చేత ఇదంతా సాధ్యమవుతుంది . 

పైన ఉన్న ఛాతి ఎక్స్-రే రేఖాచిత్రము స్పష్టముగా రెండు వైపుల ఏర్పడిన ప్రధానమైన శ్వాసనాడి (Bronchovascular) గుర్తులను తెలియజేస్తుంది .


ప్రధానమైన శ్వాసనాడి సంబంధిత (Bronchovascular) గుర్తులు వేటిని సూచిస్తాయి?

అపుడప్పుడు ఈ ప్రధానమైన శ్వాసనాడి (Bronchovascular) గుర్తులు ఊపిరితిత్తులలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ వలన సరిగ్గా కనిపించవు . 

ప్రధానమైన శ్వాసనాడి (Bronchovascular) గుర్తులు ఈ క్రింద వాటిని తెలియజేస్తాయి :

ఆస్తమా (Asthma)- ఈ స్థితిలో ఊపిరి పీల్చే వాయుమార్గం సన్నగించి, వాపు చెంది, ఎక్కువ కఫం పట్టడానికి ఆస్కారం ఉంటుంది.

దీర్ఘకాలిక శ్వాసనాలముల వాపు (Chronic bronchitis)-శ్వాసనాలశాఖలు(Bronchioles) యొక్క తీవ్రమైన మరియు దీర్ఘకాలిక వాపు(Inflammation).

బ్రొనఖోన్యూమోనియా - న్యూమోకోక్కల్ ఇన్ఫెక్షన్ (Bronchopneumonia-Pneumococcal infection)- ఊపిరి పీల్చే వాయుమార్గము సన్నగించిపోవడం మరియు వాయుకోశాలు వాపు చెందటం.


ప్లురేసీ(Pleurisy): ఊపిరితిత్తులు వాపు వలన గుండెపోటు, శ్వాస సంబంధిత ఇబంధులు కలగటం.

హార్ట్ ఫెయిల్యూర్ (Cardiac failure): కొన్ని సందర్భాలలో, తగిన మోతాదులో గుండె నుంచి రక్తం ప్రధాన రక్తనాళాలు లోనికి అందుబాటులోకి నికి రాకపోవడముచేత ,అటువంటి సందర్భంలో గుండెలో రక్తం పేరుకుపోవడం జరుగుతుంది. దీని పర్యవసానం ఊపిరితిత్తులు లోని రక్తనాళాలు వాపు చెందే అవకాశము ఉంటుంది .


పల్మనరీ హైపెర్టెన్షన్ (Pulmonary hypertension): ఇది ఒక రకమైన రక్తపోటు. ఊపిరితిత్తులు,గుండె యొక్క ధమనులు(arteries) మీద ప్రభావం చూపడం జరుగుతుంది.

వీనో- ఒక్క్లూసివ్ డిసీస్ (Veno-occlusive disease)- పల్మనరీ వేయిన్ మూసుకుపోవడము.(Occlusion of pulmonary vein): ఊపిరితిత్తులు నుంచి గుండెకు ఈ పల్మనరీ వేయిన్ ద్వారానే ఆక్సీజనాటెడ్ రక్తము పంపబడటము జరుగుతుంది.

అయినప్పటికీ, పైన ఉన్న నియమములు కేవలము సూచనలు మాత్రమే. తదుపరి విశ్లేషణ , వైద్య పరీక్షలు, చికిత్స ప్రక్రియ కొరకు మీ డాక్టరు ని సంప్రదించవలసి వస్తుంది .

పర్యవసానం:

ప్రాణవాయువు మార్పిడి కోసం ఊపిరితిత్తులు అతిముఖ్యమైన వాయుమార్గం.ఈ వాయుమార్గంలో నీరు పట్టిన యెడల అవి శ్వాస సంబంధిత మరియు దీర్ఘ కాళిక సంబంధిత సమస్యలు కి చెరదీయవచ్చు .ఈ సూచికలను గుర్తించుటకు ఛాతి ఎక్స్-రే ఉపయోగపడుతింది.ఒకవేళ మీ యొక్క ఛాతి ఎక్స్-రే నివేదిక ప్రధానమైన శ్వాసనాడి (Bronchovascular) గుర్తులను చూపించిన యెడల అక్కడ మీ ఊపిరితిత్తులలో నీరు పట్టడం ,అడ్డంకులు,సంక్రమణలు ఉన్నట్టు అర్ధము.దీనిబట్టి మీ డాక్టర్ గారు ముందస్తు పరివేక్షణ, చికిత్స పట్టిక సూచిస్తారు.

Leave a comment

Consult Now

Share MyHealth Blog